FlatNews Buy Now
చిన్నారి రఘువరన్ కు లక్ష రూపాయల చెక్కు అందజేత

చిన్నారి రఘువరన్ కు లక్ష రూపాయల చెక్కు అందజేత

డోన్, న్యూస్ వెలుగు; పట్టణం లో కొండపేట కు చెందిన చిన్నారి రఘువరన్ తలసేమియా వ్యాధితో బాధపడుతూ బెంగళూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు ఆపరేషన్ నిమిత్తం 34,00,000 ఖర్చు అవుతుందని హాస్పిటల్ వారు

చెప్పారు. రఘువరన్ తండ్రి రామకృష్ణ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు పిల్లవాని ఆపరేషన్ కొరకు తన ఇంటిని అమ్మి కొంత డబ్బు పోగు చేసి సహాయం కోసం ద్రోణాచలం సేవా సమితిని కోరగా గతంలో పునర్విక వైద్య సహాయానికి దాతల ద్వారా వచ్చిన డబ్బుల లో 1,00,000 రూపాయలు మిగిలి ఉండగా దాతల సూచన మేరకు చిన్నారి రఘువరన్ కు వైద్య సహాయంగా 1,00,000 రూపాయల చెక్కును డోన్ పట్టణ సి.ఐ. ఇంతియాజ్ బాషా చేతుల మీదుగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో టౌన్ యస్.ఐ. శరత్ కుమార్ రెడ్డి , ద్రోణాచలం సేవా సైనికులు షాదీఖాన రాజా, తాహేర్ బాషా, రమణ మాస్టర్, షబ్బీర్,ఫోటో గ్రాఫర్ బాబా,సుధాకర్,దాదాహుసేన్, రమణ, నాగరాజు లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS