
మురికి కాలవలపై నిర్లక్ష్యం
అధికారులపై ప్రజల ఆగ్రహం
తుగ్గలి, న్యూస్ వెలుగు; తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి గ్రామంలో బస్టాండ్ ఎదురుగా ఉన్న సంత బజార్ వీధిలో మురికి కాలవ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రాంతంలో కాలువ శుభ్రం చేయకపోవడంతో చెత్త, మురుగు నీరు నిల్వై దుర్వాసన వెదజల్లుతోంది. ఈ మురికి నీటి మధ్యలో త్రాగునీటి కొళాయి ఉందని స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో నిల్వైన మురుగు కారణంగా దోమలు పెరిగి, వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ముఖ్యంగా బస్టాండ్ సమీపంలో ఉండటం వల్ల ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Was this helpful?
Thanks for your feedback!

