FlatNews Buy Now
గ్రామ గ్రామాన విశ్వహిందూ పరిషత్ సమితులు

గ్రామ గ్రామాన విశ్వహిందూ పరిషత్ సమితులు

కర్నూలు (న్యూస్ వెలుగు ):  విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది సమావేశం లో అధ్యక్షులు టీ.సీ‌. మద్దిలేటి మాట్లాడుతూ….రాబోయే బజరంగ్ దళ్, దుర్గా వాహిని, మాతృశక్తి శిక్షణా వర్గలలో ప్రఖంఢ ఆపై స్థాయి కార్యకర్తలను పంపి ప్రఖంఢలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ప్రధాన వక్తగా విచ్చేసిన రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ విశేష సంపర్క విభాగం కన్వీనర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ…..గ్రామస్థాయిలో,ప్రఖండ స్థాయిలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల బలోపేతం చేయాలని, తద్వారా విశ్వ హిందూ పరిషత్ సఃస్థాగతమైన 7 పండుగలు నిర్వ హించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రాంత సూచన మేరకు జిల్లా లోని జరిగే అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు,

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి సందడి మహేష్ జిల్లా కోశాధికారి తుంగా రమేష్ జిల్లా సహకార్యదర్శు గూడూరు గిరిబాబు ,జంపాల నవీన్, సంగు రాంబాబు, కరణం సుధాకర్ ,సత్సంగ ప్రముఖ్ పరశురాం,బజరంగ్దళ్ సహ సంయోజక్ చామిరాజు, విశేష సంపర్క ప్రముఖ్ శివపురం నాగరాజు, ప్రసార ప్రచార ప్రముఖ ఉపేంద్ర నాయక్, ధర్మ ప్రసార సహా ప్రముఖ్ ఉర్లకుంట్ల సంజీవయ్య, సహా సేవా ప్రముఖ్ బాబురావు ధర్మయాత్ర ప్రముఖ్ కాకి నటరాజ్ బజరంగ్దళ్ బలోపాసనా ప్రముఖ్ రాము, గుజరాతి సురేష్, జెపి సింగ్ , కర్నూలు గ్రామీణ అధ్యక్షులు బోయ గోవిందు తదితరులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!
1
2

COMMENTS