FlatNews Buy Now
ఘనంగా మాతృ దినోత్సవం

ఘనంగా మాతృ దినోత్సవం

డోన్ (న్యూస్ వెలుగు ): మాతృ దినోత్సవ సందర్భంగా ఉడమలపాడు గ్రామ ఉప్పరి లక్ష్మీదేవి ఈడిగా జయలక్ష్మి కి నంద్యాల ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి భారతమాత చిత్రపటమును అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మద్దమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఈ నాగరాజు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో డోన్ మండల టాపర్గా తన్విత 575 మార్కులు సాధించింది అదే పాఠశాల విద్యార్థి వర్షిత 571 మార్కులు సాధించడంతో వారని అభినందించినట్లు తెలిపారు. డోన్ మండలంలో టాపర్లుగా వచ్చినందుకు గాను వారి తల్లులకు మాతృ దినోత్సవ సందర్భంగా సన్మానించడం జరిగినదని గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన తల్లిదండ్రులకు సన్మానిస్తున్నామని ఈ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు తన్విత తండ్రి ఉప్పరి వెంకటేశ్వర్లు తల్లి ఉప్పరి లక్ష్మీదేవి వీరి స్వగ్రామము ఉడుములపాడు వర్షిత తండ్రి చంద్రశేఖర్ గౌడ్ తల్లి జయలక్ష్మి వీరు మధ్య తరగతి కొడుంబీస్తులు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు మోహన్ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS