17న కురువ విద్యార్థుల ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం

17న కురువ విద్యార్థుల ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం

కర్నూలు జిల్లా కురువ సంఘం.

కర్నూలు, న్యూస్​ వెలుగు:  ఈనెల 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కర్నూలు నగర సమీపంలోని పెద్దపాడు రోడ్ లోని ఏ.పీ.మోడల్ స్కూల్ ప్రక్కన ఉన్న శ్రీ భీరలింగేశ్వర స్వామి ప్రాంగణం నందు కురువ విద్యార్థుల ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు,ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, కోశాధికారి కే.సి.నాగన్న ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, బి. వెంకటేశ్వర్లు, కె. టి.ఉరుకుందు కత్తి శంకర్ నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు తెలియజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదవ తరగతి ఇంటర్ మీడియేట్ పరీక్షలు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు నిబంధనలు ప్రకారం పంపిన ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కర్నూలు జిల్లా కురువ సంఘం తరపున మేమెంటో ప్రతిభా పురస్కారం అందుకోవాలని కోరారు. తల్లిదండ్రులు కురువ సంఘం నాయకులు కురువ కులస్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.సి.తిరుపాలు,వెంకటేశ్వర్లు దివాకర్,మద్దిలేటి,వీరన్న పెద్దపాడు పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS