నూతన ఆర్డీవోను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు 

నూతన ఆర్డీవోను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు 

పత్తికొండ మే 15:- పత్తికొండ డివిజన్ ఆర్డీవో గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిన్న ఓబులేష్ ను శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ రామకొండ వెంకటేష్ జిల్లా అధ్యక్షులు బురుజుల పులికొండ,గోపాలం ఉచ్చూరప్ప,బొంతల నరసింహులు ఆధ్వర్యంలో ఆర్డీవో ను మర్యాదపూర్వకంగా కలిసి శాలవలు. పూలదండలు వేసి సన్మానించారు. అనంతరం ఆర్టీవో మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి రెవెన్యూ పరంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు ఆర్డీవోకు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు లకసాగరం హనుమంతు, ముత్యాల ప్రసాద్,రామాంజనేయులు,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS