కర్నూలు వ్యాప్తంగా 500 ఇల్లలో తనిఖీ చేసిన పోలీసులు

కర్నూలు వ్యాప్తంగా 500 ఇల్లలో తనిఖీ చేసిన పోలీసులు

కర్నూలు  (న్యూస్ వెలుగు) జిల్లావ్యాప్తంగా   “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా విస్తృత తనిఖీలు చేసినట్లు జిల్లా ఎస్పీ విశ్రాంతి పార్టీ తెలిపారు. సరైన పత్రాలు లేని 40 వాహనాలు, 90 (48 మద్యం సీసాలు మరియు 42 సారాయి ప్యాకెట్లు) మద్యం సీసాలు, సారాయి ప్యాకెట్లు స్వాధీనం చేసినట్లు వెల్లడించారు.

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా  జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్‌లలో శనివారం మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించారు.

పత్తికొండ, వెల్దుర్తి ,  ఎమ్మిగనూరు, కనకవీడు , ఆదోని, పెద్ద తుంబళం, కుప్పనగల్ , కర్నూలు  తాలుకా, వెంకన్నబావి, దిన్నెదేవరపాడు, అంబేద్కర్ నగర్ ప్రాంతాలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు , స్పెషల్ టీం లు, పోలీసు సిబ్బంది మొత్తం 162 మంది పాల్గొన్నారు. హాట్ స్పాట్ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 500 ఇళ్ళను తనిఖీలు చేశారు. 2,500 మంది ని తనిఖీలు చేశారు. 120 వాహనాలను తనిఖీలు చేశారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక , చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు.

గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలతో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేయించారు.సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పోలీసు అధికారులు పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల ను పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి , కర్నూలు ఇన్చార్జి డిఎస్పి ఉపేంద్ర బాబు, సిఐలు, ఎస్సైలు , స్పెషల్ టీం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS