ధరలు తగ్గించాలని రాస్తా రోకో చేసిన సీపీఎం

ధరలు తగ్గించాలని రాస్తా రోకో చేసిన సీపీఎం

తుగ్గలి  ( న్యూస్ వెలుగు ) : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తుగ్గలి లోని రాములమ్మ కట్ట ఎదుట రహదారిపై పెంచిన ధరలు తగ్గించాలని శనివారం రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సిపిఎం మండల కమిటీ సభ్యుడు, సిపిఎం అనుభందిత రైతు సంఘం తుగ్గలి మండల అధ్యక్షులు రాంపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ జి.శ్రీరాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన ఫలితాలు వెలబడిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం చాలా అన్యాయమన్నారు. ఇది నిరుపేదలపై మోయలేని భారం మోపడం తప్ప మరొకటి కాదన్నారు. ఒక పక్క నిరుద్యోగం అమాంతం పెరిగిపోతుందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. కావున పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే పేద ప్రజలను సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరప్ప, హనుమంతు, రాము, లింగప్ప తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS