కురువ విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు..!

కురువ విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు..!

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు

కర్నూలు, న్యూస్​ వెలుగు:   కర్నూలులో కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. విద్యాపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు నగర సమీపంలోని పెద్దపాడు రోడ్ లోని ఏ.పీ.మోడల్ స్కూల్ ప్రక్కన ఉన్న శ్రీ భీరలింగేశ్వర స్వామి ప్రాంగణం నందు కురువ విద్యార్థుల ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని  జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, కోశాధికారి కే.సి.నాగన్న ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, బి. వెంకటేశ్వర్లు, కె. టి.ఉరుకుందు, నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు కార్యదర్శి బి. రామకృష్ణ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో డాక్టర్ నరసరాం కోడుమూరు ఎక్సైజ్ సీఐ శ్రీమతి మంజుల,ఉమ్మడి జిల్లా గొర్రెల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు, కల్లూరు సహకార సంఘం చైర్మన్ పర్ల శేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరాముడు గొర్రెల సహకార సంఘం డైరెక్టర్లు ఎం.కే మద్దిలేటి, యుగంధర్ రేమట సర్పంచ్ వెంకన్న జిల్లా మహిళా సంఘం అధ్యక్ష,కార్యదర్శులు టీ లీలమ్మ,అనిత పాల్గొన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదవ తరగతి ఇంటర్ మీడియేట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు  కర్నూలు జిల్లా కురువ సంఘం తరపున కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి కురువ నాగరాజు  చేతుల మీదుగా  ప్రోత్సహక బహుమతులు 160 మందికి నగదు వెయ్యి రూపాయలు, ప్రశంసా పత్రం, ధనుంజయ ఫౌండేషన్ వారి మెమోంటో లు, స్వామి వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ సాంబశివుడు 160 మంది విద్యార్థులకు బ్యాగులు,పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది  ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ ఇంతమంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు తమ చదువును ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని ఈ వేదిక ద్వారా దిశానిర్దేశం చేశారు. ఉన్నత విద్యలో కురువ విద్యార్థులు రాణించడానికి అవసరమైన ఆర్థిక, విద్యాపరమైన సహాయాన్ని అందించడానికి  భరోసా ఇచ్చారు. ఒకప్పటి గొర్రెల కాపరులుగా కాకుండా విద్యావేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. దేశం గర్వించే విధంగా విద్యను అభ్యసించాలని కోరారు.  పిల్లలను చదివించాలని, అందరూ ఐక్యమత్యంతో ఉంటే అన్ని సాధించుకుంటారని, ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో,రాష్ట్ర కురువ సంఘం నాయకులు గడ్డం రామకృష్ణ,శ్రీ మేధా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ కే రాము,స్వామి వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ సాంబశివుడు, కురువ పాపరాయుడు,బూదుర్ లక్ష్మన్న, బి.సి.తిరుపాలు,అల్లూరు వెంకటేశ్వర్లు,  మద్దిలేటి,  పెద్దపాడు పుల్లన్న, మండల నాయకులు రాంగోపాల్, పెంచికలపాడు కృష్ణ, అల్లబాబు, సిపిఎం వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS