
రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు హనుమేష్
న్యూస్ వెలుగు : – పత్తికొండ మే 24:
పల్నాడు జిల్లా కోటప్పకొండ లో జూన్ 1 నుండి 5 వరకు జరగబోయే రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు తరలిరావాలని ఆదివారం రోజున చదువుల రామయ్య భవనంలో విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ఉపాధ్యక్షులు హనుమేష్ తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని స్వయానా సుప్రీంకోర్టు జడ్జి నిరుద్యోగులను కాక్రోచ్ తో పోల్చడం విడ్డూరం అన్నారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత దృష్టిని మళ్లించడానికి మతాల పేరుతో కులాల పేరుతో దేశంలో యువకులను పక్కదారి పట్టిస్తున్నారు అని వారిని సరైన దారిలో నడిపించడానికి ఈ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నవి అని యువతి యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో పత్తికొండ మండల కార్యదర్శి సిద్దు, మండల అధ్యక్షులు పరమేశు, ఏఐవైఎఫ్ నాయకులు ఉపేంద్ర ఆచారి, రవి, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

