తిరుపతిలో అద్భుతంగా మునివాహన సేవా కార్యక్రమం

తిరుపతిలో అద్భుతంగా మునివాహన సేవా కార్యక్రమం

తిరుపతి, న్యూస్​ వెలుగు:  తిరుపతి శ్రీనివాస మంగాపురం లలితా పీఠంలో హిందూ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని మహేష్ డేగల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. హిందూ సమాజంలో వివక్షత లేదు, అందరూ సమానం దేవాలయాల ప్రవేశం ఎవరి అబ్బ సొత్తు కాదు అందరిదీ అనేటువంటి హిందూ సిద్ధాంతం చాతుర్వర్ణం మయాసృష్టం అనే కృష్ణ భగవానుడు చెప్పినటువంటి సిద్ధాంతమే మూలమనేటువంటి విషయంతో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన కుల వివక్షత వలనే నేడు హిందూ సమాజం చీలికలు తేలికలైందని దీనికి వ్యతిరేకిస్తూ హిందూ సమాజం ఒక్కటే అనే ఉద్దేశంతో ఆనాడు శ్రీరంగంలో తిరుప్పారాళ్లవారిని సారంగముని గా దేవాలయ ప్రవేశాన్ని చేసినటువంటి సారంగముని మార్గదర్శనంలో నేడు తిరుప్పారావ్వారుగా శ్రీ నాగరాజన్ మునస్వామి ని భుజాలపైన ఎక్కించుకొని మహేష్ డేగల సారంగమునిగా లలితా పీఠంలోని దివ్య దేవాలయంలోకి తీసుకొని వచ్చి అమ్మవారి అర్చన పూజలు చేయించి హిందూ సమాజ ఐక్యతకు ఒక్కటే మూలమనే ప్రపంచానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉపాధ్యాయ సమితి నాయకులు హిందూ బంధువులు ఈశ్వర ప్రసాద్,జయచంద్రా రెడ్డి, శేషగిరిరావు శర్మ, మెహర్ బాబా లోకనాథరెడ్డి, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS