జిల్లాలో 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన లక్ష్యం

జిల్లాలో 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన లక్ష్యం

56 పాఠశాలల్లో ‘అనంత అరణ్య’ ప్లాంటేషన్ కార్యక్రమం

జలధార – జలహారతి పనులు వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలి

హార్టికల్చర్ విస్తరణతోనే రైతుల ఆదాయం, జిల్లా జీడీపీ పెరుగుతుంది : కలెక్టర్ రాజకుమారి

నంద్యాల జిల్లా న్యూస్ వెలుగు  జూన్ 09: జిల్లా ఆర్థికాభివృద్ధి, రైతుల ఆదాయాల పెంపు లక్ష్యంగా హార్టికల్చర్ విస్తరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా జిల్లా జీడీపీని గణనీయంగా పెంచేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో కార్యాచరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్

నుంచి ఎంపీడీఓలు, ఉపాధి హామీ, జలవనరులు తదితర శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హార్టికల్చర్ విస్తరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన, అనంత అరణ్య (అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్), జలధార–జలహారతి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో అమలవుతున్న అనంత అరణ్య కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. హార్ట్‌ఫుల్‌నెస్ ఫౌండేషన్ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన 56 విద్యాసంస్థల్లో అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, కంపోస్ట్ పిట్స్, సోక్ పిట్స్, సోలార్ ఎనర్జీ వినియోగం వంటి కార్యక్రమాలు చేపట్టి వాటిని నెట్ జీరో హెల్తీ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. జిల్లా ఆర్థికాభివృద్ధిలో హార్టికల్చర్ కీలక పాత్ర పోషిస్తోందని… ప్రస్తుతం 49 వేల హెక్టార్లలో సాగవుతున్న ఉద్యానవన పంటలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం 49 వేల హెక్టార్లలో సాగవుతున్న హార్టికల్చర్ ద్వారా సుమారు రూ.7,500 కోట్ల ఆదాయం లభిస్తుండగా, 2.70 లక్షల హెక్టార్లలో సాగవుతున్న సంప్రదాయ వ్యవసాయం ద్వారా రూ.3,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోందని వివరించారు. రైతుల ఆదాయాలు, జిల్లా జీడీపీ, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు హార్టికల్చర్ విస్తరణపై అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. డోన్, మహానంది వంటి ప్రాంతాల్లో ఉద్యానవన పంటల ద్వారా అధిక ఆదాయాలు వస్తుండగా, వరి సాగుపై అధికంగా ఆధారపడుతున్న కొన్ని మండలాల్లో తలసరి ఆదాయం తక్కువగా ఉందని పేర్కొన్నారు. రైతులను అధిక ఆదాయం వచ్చే పంటల వైపు మళ్లించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది 5,000 ఎకరాల్లో హార్టికల్చర్ ప్లాంటేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఏ ప్రాంతానికి ఏ పంట అనుకూలమో గుర్తించి రైతులకు అవగాహన కల్పించాలని, లబ్ధిదారుల ఎంపిక, సాగు వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలని ఆదేశించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యువత, మహిళా సంఘాలు, ఆసక్తి కలిగిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. పాలు ఆధారిత ఉత్పత్తులు, గోంగూర పికిల్స్, మిల్లెట్ ఉత్పత్తులు, ఆర్గానిక్ సోప్స్, బేకరీ ఉత్పత్తులు తదితర యూనిట్ల స్థాపనకు బ్యాంకు రుణాలు, సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జూలై నెలలోపు కనీసం 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించాలనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని ఆదేశించారు.

జిల్లాలో పశుసంవర్ధక రంగం ద్వారా సుమారు రూ.5,000 కోట్ల ఆదాయం లభిస్తోందని, పాల ఉత్పత్తిని పెంచేందుకు పశువులకు నాణ్యమైన మేత, దాణా అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 11 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా, జిల్లాకు 16 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉందన్నారు.

జలధార – జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన 2,150 పనులలో 761 పనులు పూర్తయ్యాయని, ఇంకా పూర్తి కాని పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా తక్కువ ప్రగతి నమోదైన మండలాల్లో అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS