
ఆస్పరి మండల పరిధిలో ఉన్న ప్రవేట్, విద్యాసంస్థల దోపిడిని అరికట్టాలి
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి
సమరశీల పోరాటాలకు సిద్ధం….విద్యార్థి యువజన సంఘాలు ఆస్పరి
న్యూస్ వెలుగు, ఆస్పరి : కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు అడ్మిషన్లు నిర్వహించే వారి పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాలు నాయకులు రమేష్ రవి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలకు పంపించాలని క్రమంలోనే ప్రైవేట్ పాఠశాల యజమాన్యులు దానిని ఆసరాగా చేసుకుని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి మా పాఠశాలలో చేరండి మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని కళ్ళ బోని మాటలతో పాఠశాలలో ప్రారంభించక ముందే అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. మండలంలోని ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలలో పాఠశాలలో ప్రారంభించక ముందే ప్రభుత్వ నిబంధనలో పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా అధిక ఫీజుల దోపిడీ చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని పిలుస్తున్నారు. బుక్స్, బ్యాగు యూనిఫామ్ పేర్లతో అధిక ఫీజు వసూలు చేస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేనిపక్షంలో విద్యార్థి యువజన సంఘాలు విద్యార్థులను యువతను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాలు నాయకులు తరుణ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు..

