తుగ్గలిలో వైఎస్సార్‌సీపీ నేత పిలుపు

తుగ్గలిలో వైఎస్సార్‌సీపీ నేత పిలుపు

వై.ఎస్.ఆర్.సి.పి రాష్ట్ర రైతు విభాగపు ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ రెడ్డి

తుగ్గలి, జూన్ 09  న్యూస్ వెలుగు :మండల కేంద్రమైన తుగ్గలిలో వై.ఎస్.ఆర్.సి.పి రాష్ట్ర రైతు విభాగపు ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ రెడ్డి తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, అప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి,వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు తుగ్గలి మండలంలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జూన్ 12న రాష్ట్రంలోని 175 నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ర్యాలీలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, పత్తికొండ నియోజకవర్గం ఐటి విభాగపు అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS