కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశానికి తరలిరండి: ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు 

కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశానికి తరలిరండి: ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు 

పత్తికొండ :  పెరుగుతున్న ఆర్థిక, సామాజిక,రాజకీయ అసమానతల నేపథ్యంలో దళితులు అనేక ఓడుదుడుకులను ఎదుర్కోవడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులికొండ అధ్యక్షతన పత్తికొండ కేంద్రంగా జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొని మాట్లాడారు. గత 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ అనేక ఉద్యమాలను చేసి వర్గీకరణ తీసుకొచ్చేందని వారు గుర్తు చేశారు. జూన్ 13న కర్నూలు జిల్లా కేంద్రంగా జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాలోని దళితులు అందరూ తప్పక హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తో పాటు రాష్ట్ర అధ్యక్షులు షాలేం రాజు మాదిగ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పాల్గొననున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులికొండ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS