
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు దరఖాస్తుల స్వీకరణ
తుగ్గలి, జూన్ 11 న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు తుగ్గలి లో సాధన ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు తుగ్గలి మండల పరిధిలోని అన్ని రెవెన్యూ గ్రామాలు, మజరా గ్రామాల ప్రజల నుంచి భూ సమస్యలు, ఇతర ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పత్తికొండ శాసనసభ్యులు పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా విననున్నారు. ప్రజలు తమ భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, సంక్షేమ పథకాలు మరియు ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని పేర్కొన్నారు. అందువల్ల తుగ్గలి మండలంలోని గ్రామాలు, మజరా గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమమునకు మండల అధికారులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, మరియు రెవెన్యూ సిబ్బంది, హాజరై సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.

