
చెన్నంపల్లిలో ఘనంగా దస్తగిరి స్వామి దర్గా ప్రారంభోత్సవం
హిందూ–ముస్లిం ఐక్యతకు ప్రతీకగా కార్యక్రమం
తుగ్గలి, జూన్ 11 న్యూస్ వెలుగు : తుగ్గలి మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో గురువారం దస్తగిరి స్వామి దర్గా ప్రారంభోత్సవాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సహకారంతో సుమారు రూ.10 లక్షల వ్యయంతో పురాతన దర్గాను నూతనంగా పునర్నిర్మించి భక్తులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం సోదరులు కలిసి దర్గా ప్రాంగణంలో పవిత్ర జెండాను ఆవిష్కరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమంలో రెండు వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం గ్రామంలోని ఆడబిడ్డలకు కొత్త బట్టలు పంపిణీ చేసి, ఒడిబియ్యం పోసి ఆశీర్వదించారు. దస్తగిరి స్వామి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, దర్గాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాకుండా మానవత్వం, ప్రేమ, సామరస్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. చెన్నంపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమం హిందూ–ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు. దర్గా పునర్నిర్మాణం గ్రామ ప్రజల ఐక్యతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, మాజీ జెడ్పీటీసీ జగన్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు పి. వెంకటపతి, గ్రామ పెద్దలు మా భాషా, రాజేంద్ర గౌడ్, హుస్సేన్ షా, షాషావలి, రంజాన్, సుభాన్, అక్బర్ బాషా, సత్తార్, లక్ష్మీనారాయణ చౌదరి, డీలర్ సీనప్ప , కోటేష్ గౌడ్, చెన్నంపల్లికి చెందిన రైల్వే కోడూరు ఏపీఎస్పీ ఎస్సై ఆలీ బాషా, రామలింగయ్య పల్లె రంగనాథ్ రెడ్డి, నాగిరెడ్డి, రాళ్లు కొట్టించే సుంకన్న, సంజీవ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

