
వాల్మీకి ఫెడరేషన్ నిధులు కేటాయించండి : వాల్మీకి అంజి
వాల్మీకి ఫెడరేషన్ విధానాలపై బోయ వాల్మీకి సమితి ఆగ్రహం
బోయ వాల్మీకి సమితి (బివిఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు వాల్మీకి అంజి
తుగ్గలి, జూన్ 15:( న్యూస్ వెలుగు ): వాల్మీకి ఫెడరేషన్ చేపడుతున్న విధానాలు బోయ వాల్మీకి సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని బోయ వాల్మీకి సమితి (బివిఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు వాల్మీకి అంజి విమర్శించారు. ఫెడరేషన్‌కు తగిన నిధులు లేకపోయినా అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఫెడరేషన్ చైర్మన్, డైరెక్టర్లకు నెల నెలా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటూ, బోయ వాల్మీకుల అసలు సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక మంది బోయ వాల్మీకులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగం, పేదరికం, ప్రజల ఆవేదన రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సమాజ భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. బోయ వాల్మీకుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, సమాజానికి న్యాయం జరిగేలా చూడాలని వాల్మీకి అంజి డిమాండ్ చేశారు.


