50ఏళ్ళు నిండిన వారికీ పెన్షన్ అందించండి

50ఏళ్ళు నిండిన వారికీ పెన్షన్ అందించండి

50 సంవత్సరాలు నిండిన వడ్డెర కుల వృత్తి వారికి పెన్షన్ సౌకర్యం త్వరగా కల్పించాలి – వడ్డెర సంఘం

నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు )  జూన్ 15 : ఆంధ్రప్రదేశ్ నంద్యాల వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి చెల్లా వెంకటేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గోగుల గోపాలు శివకృష్ణ, పలుకూరు నంద్యాల మధు, వేణు, నంద్యాల సురేష్ , యాలూరు సుబ్బలచ్చమ్మ, గోవిందపల్లి వెంకటలక్ష్మి, నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బ లచ్చమ్మ, చర్ల సుబ్బరాయుడు, నంద్యాల జిల్లా వడ్డెర సంఘం నాయకులు వల్లపు వెంకటసుబ్బయ్య, నంద్యాల సంఘం నాయకులు తదితరులు కలిసి నంద్యాల టిక్కీ మార్కెట్ యార్డ్ లో నంద్యాల ఎంపీ డాక్టర్. బై రెడ్డి శబరి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చల్లా వెంకటేష్, గోగుల గోపాల్, శివకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన కూటమి ప్రభుత్వానికి గెలుపొందిన అభ్యర్థులకు మా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని, ఈ అఖండ విజయానికి వడ్డెర జాతి కూడా కృషిచేసినందున గౌరపడుతున్నాము అన్నారు. ఎన్నికల ముందు వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం మరియు ఇతర అంశాలను బైరెడ్డి శబరి తో నంద్యాల జిల్లా సంఘం నాయకులు కలిసి ఐక్యమత్యంతో ఉండి వడ్డెర్ల సమస్యలను తెలపడం జరిగిందని, రాళ్లు కొట్టి ఆధునిక పరిజ్ఞానం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో మట్టి సిమెంటు ఇటికలు ఐరన్ ప్లాస్టిక్ వంటి వాటితో నిర్మాణాలు సాగుతూ వస్తున్నాయి. దీంతో వంశపారముగా కుల వృత్తిని జీవనోపాధిగా మార్చుకున్న వడ్డెర సమ్మేటలు మూలన పడడంతో దుస్థితి ఏర్పడిందన్నారు. కుల వృత్తి మూలన పడడంతో క్యారెలీలలో కూలీలుగా వస్తాయి కూలీలుగా రూప తాపర చెందుతారు పట్టణాలు నగరాలు వలస పోయి భవన నిర్మల కూలీలుగా ఇతరాంతర పనులు చేతులు వంటివి చేస్తున్నాము. కొండలను రోడ్లుగా మొలసి చేయగల వడ్డెర్ల చేతితో తవ్వకం పనులను వడ్డెర్లకు రిజర్వేషన్ 30% శాతం కేటాయించడానికి వడ్డెర సంఘం వడ్డెర భవన నిర్మించేందుకు నంద్యాల జిల్లాలో 650 చదరపు గజాలు కేటాయించడానికి ప్రభుత్వం అంగరించాలని, నిరుపేదలైన వడ్డెర్లకు ఇల్లు లేనివారికి నిరుపేదలకు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇల్లు కట్టించి వాళ్ళని బంజర భూములలో కుటుంబానికి 10 ఎకరాలు చొప్పున భూమి పంచివాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన వడ్డెర కుల వృత్తి వారికి పెన్షన్ సౌకర్యం త్వరగా కల్పించాలని, 5 సంవత్సరాల అయినా కూడా వడ్డెర ఫెడరేషన్ కు సొసైటీలో ద్వారా 15 మంది గ్రూపుగా ఏర్పాటు చేసుకున్నా కూడా ఆన్లైన్ చేసుకున్నా కూడా రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఫెడరేషన్ నుంచి రూ.40 లక్షల కేటాయించాలని,రూ. 20 లక్షలు సబ్సిడీ తీసివేయాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS