
చలో ఈదుముడి పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి
చలో ఈదుముడి పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి
కర్నూలు (న్యూస్ వెలుగు ) : చలో ఈదుముడి పోస్టర్ ఆవిష్కరణ లో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా పరిషత్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాదిగల పుణ్యక్షేత్రమైన ప్రకాశం జిల్లా ఈదుముడి లో జులై 7న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాదిగను తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గద్ద రాజశేఖర్, కన్నీమారకల వెంకటేష్, జి చంద్రశేఖర్, జి రాజేష్, సంజు, చరణ్, రవి, శేఖర్, లాసర్, శ్రీరాములు, సందీప్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

