FlatNews Buy Now
సెక్యూరిటీ చేతివాటం ఆగ్రహించిన భక్తులు

సెక్యూరిటీ చేతివాటం ఆగ్రహించిన భక్తులు

సోమవారం అమావాస్య సందర్భంగా శ్రీ.నరసింహ ఈరన్న స్వామి క్షేత్రంలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం..!

సెక్యూరిటీ చేతివాటం చేసిన కూడా ఆలయ చైర్మన్ వై స్ చైర్మన్ ఏం చేస్తున్నట్లు..?

పురుగు రాష్ట్రాల నుంచి వేలాదికొద్ది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు..

కౌతాళం : 15 : జూన్ : ( న్యూస్ వెలుగు  ) : కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉరుకుంద శ్రీ.నరసింహ ఈరన్న స్వామి సన్నిధిలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది చితివాటం ప్రదర్శిస్తూ భక్తులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. టికెట్టు లేని వారితో ఎగ్జిట్ గేటు నుంచి డబ్బులు వసూలు చేస్తూ అనుకూలంగా ఉన్నవారిని ఆలయంలోనికి వదులుతున్న తరుణంలో మరో భక్తుడు మేం కూడా డబ్బులు ఇస్తాం వదులు అంటే వదలకుండా ఇబ్బంది పెడుతున్నాడని భక్తుడు సిబ్బందితో గొడవకు దిగాడు వీరు చేస్తున్న బాగోతం అంతా కెమెరా లో మరొక భక్తుడు చిత్రీకరించడం జరిగింది. ఎంతో ప్రసిద్ధిగాంచిన పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి వారి వల్ల క్షేత్రానికి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదని ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు.

 

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS