ముగింపు దశలో ఎస్.ఐ.ఆర్. కార్యక్రమం.. శిబిరాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్ రవి
తుగ్గలి, జూలై 12 ( వెలుగు న్యూస్ ): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఆదివారం మండలంలోని జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఎస్ రవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శభాష్ పురం గ్రామ సచివాలయంలో బిఎల్ఓ లకు వివిధ పార్టీల ఏజెంట్లకు ఆయన తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అందిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి అర్హుల వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని బీఎల్వోలు, సంబంధిత సిబ్బందికి సూచించారు. శిబిరం ముగిసేలోపు పెండింగ్ దరఖాస్తులను పూర్తిచేయాలని ఆదేశించారు. అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని తహసీల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సంఘం సిబ్బంది, తుగ్గలి ఎంపీపీ గౌరవ సలహాదారుడు శభాష్పురం హనుమంతు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

