జాతీయ ప్రాజెక్టు పోలవరం వద్ద బీజేపీ నేతల సమీక్ష.. పాల్గొన్న తుగ్గలి నవీన్ రెడ్డి

జాతీయ ప్రాజెక్టు పోలవరం వద్ద బీజేపీ నేతల సమీక్ష.. పాల్గొన్న తుగ్గలి నవీన్ రెడ్డి

తుగ్గలి, జూలై 16 ( వెలుగు న్యూస్ ): పత్తికొండ నియోజకవర్గం బిజెపి నేత తుగ్గలి నవీన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆధ్వర్యంలో జరిగిన పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో పాల్గొని, ఆ జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ మరియు ఇతర నాయకులను కలిశారు. పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లిన ఆయన, తుగ్గలి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉన్నతీకరించాలని, అలాగే నియోజకవర్గాన్ని సందర్శించాలని కోరారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయి, తద్వారా రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని నవీన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS