
కూటమి నాయకులు వెంటనే స్పందించి అనాది అమ్మాయికి పెన్షన్ మంజూరు చేయాలి
కౌతాళం, న్యూస్ వెలుగు : కౌతాళం మండలం దోమలదిన్నె గ్రామానికి చెందిన రామలింగమ్మ వెంకోబా వారికి నలుగురు ఆడపిల్లలు రెండో అమ్మాయి రంజిత అనే అమ్మాయి అనాది మాటలు రాకతో ప్రతి జిల్లాలకు వెళ్లి ఆసుపత్రులకు చూపించిన డాక్టర్లు మాటలు రావు అని చెప్పడంతో పెన్షన్ కు అప్లై చేసుకున్నాం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మీ అమ్మాయికి పెన్షన్ రావాలంటే 5000 రూపాయలు ఇస్తే పెన్షన్ వస్తుంది లేకపోతే రాదు అనడంతో 5000 రూపాయలు ఇచ్చారు.తిరిగి వెళ్లి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అడగగామీ అమ్మాయికి మాటలు వస్తాయని తిరిగి పంపించారు.అనాధగా ఉన్న అమ్మాయికి మాటలు ఎలా వస్తాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే మేమేం చేయలేము మీరు పెన్షన్ కోసం అప్లై చేసుకున్నడిలీట్ అయిందన్నారు.
బాగున్నవారకు పెన్షన్ వస్తుంది మా అమ్మాయి ఇంత అనాధగా ఉన్నా కూడా ఎందుకుపెన్షన్చేయలేకపోతున్నారు. అధికారులకు గాను గ్రామ పెద్దలకు గాను కంటికి కనిపిస్తుందా లేదయ్యా
మా అమ్మాయి అనాది మాటలు రావు అలాంటి వారికి పెన్షన్ చేయకపోతే ఇంకా ఎలాంటి వాళ్లకు చేస్తారో ఓట్లు అడిగేటప్పుడు మాత్రమే మీ అమ్మాయికి పెన్షన్ వచ్చేలా చేస్తామంటారు. ఏ నాయకుడు చేయడు త్వరలో సర్పంచ్ ఎన్నికలలో వారికి ఓట్లతో బుద్ధి చెప్తామని వారు ఆవేదన చెందారు. మాకు ఉన్న ఎకరా పొలంతోనే నలుగురు ఆడపిల్లల ను కూలి వెళ్లి పిల్లలను పోషించుకుంటున్నామన్నారు.కూలి వెళితే పూటకు గడవాలన్నా కష్టంగా ఉందన్నారు. నలుగురు ఆడపిల్లలతో ఇబ్బందిగా మారిందన్నా తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరా లు కావొస్తుంది.మా అమ్మాయికి పెన్షన్ రాకపోవడంతో చాలా బాధేస్తుందన్న తల్లి ఈ సందర్భంగా కౌతాళం ఎంపీడీవో స్వర్ణ లత గారు వెంటనే స్పందించి దోమలదీన్నే గ్రామానికి చెందిన రంజిత అనే అమ్మాయికి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. గ్రామ సచివాలయానికి వెళితే మాపై చిన్న చూపులు చూస్తున్నారని తల్లి రామలింగమ్మ కన్నీరు పెట్టారు. డబ్బు ఇచ్చినా కూడా పెన్షన్ రాకపోవడంతో చాలా బాధాకరమన్న బాధ్యతరాలు.

