ఈనెల 14న సోలార్ బాధిత రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

ఈనెల 14న సోలార్ బాధిత రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి

   రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ  

సోలార్ కంపెనీలు గ్రామపంచాయతీకి 10 శాతం నిధులు ఎవరి ఖాతాలోకి వెళుతున్నాయి…..

న్యూస్ వెలుగు – పత్తికొండ: ఈనెల 14వ తారీఖున అనంతపురం జిల్లా గుత్తి పట్టణం నందు పెద్ద శాదిఖాన ఫంక్షన్ హాల్ లో సోలార్ బాధిత రైతులు తలపెట్టిన

రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామం నందు రైతు సమావేశం జరిగింది ఈ సమావేశానికి పార్టీ మండల కమిటీ సభ్యులు సురేంద్ర అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథులుగా హాజరైన రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే. ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 29 సంవత్సరాల 11 నెలల దీర్ఘకాలిక ఒప్పందం వల్ల భూములపై రైతులు శాస్త్రీయతంగా హక్కు కోల్పోయే అవకాశం ఉందని ఐదు సంవత్సరాలకు ఒకసారి లీజు ఒప్పందం తిరిగి రాయాలని పాత ఒప్పందాలను రద్దు చేయాలని వారు తెలిపారు. రైతుల భూములను సోలార్ కంపెనీలు లీజుకు తీసుకోవడంలో కొనుగోలులో మధ్య దళారులు ద్వారా కాకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా చేయాలనీ వారు డిమాండ్ చేశారు. 14వ తారీకు అనంతపురం జిల్లా గుత్తి పట్టణం నందు జరిగే సోలార్ బాధిత రైతు రాష్ట్ర సదస్సులో సోలార్ కంపెనీలు రైతులతో కుదుర్చుకుంటున్నటువంటి దీర్ఘకాలిక ఒప్పందాల వల్ల రైతులకు కలిగే నష్టాల గురించి 14 డిమాండ్లతో కూడిన ప్రసంగాలు చేయనున్నట్లు ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం పత్తికొండ మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్ పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర రైతు సంఘం అధ్యక్షులు గంగన్న ఉపాధ్యక్షులు మధు రాజుల కారప్ప కౌలుట్ల, బ్రహ్మయ్య జయప్రకాశ్ రెడ్డి ఉమాకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS