
తక్కువ నీటితో పంటల సాగుకు పీఎండీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరం
వర్షాభావ పరిస్థితుల్లో పంటల రక్షణకు పీఎండీఎస్ విధానం
ప్రకృతి వ్యవసాయం, సహజ విత్తన శుద్ధి విధానాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
వెల్దుర్తి , న్యూస్ వెలుగు : తక్కువ నీటి లభ్యత, వర్షపాతం లోటు ఉన్న పరిస్థితుల్లో పంటల సాగుకు పీఎండీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. రైతులు ఈ విధానాన్ని అవలంబించి తక్కువ నీటితో మెరుగైన దిగుబడులు సాధించాలని సూచించారు.బుధవారం వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామము లో పీఎండీఎస్ లో భాగంగా నిర్వహించిన విత్తనాలు చల్లే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. తక్కువ నీటితో పంటల సాగుకు పీఎండీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ… పీఎండీఎస్ విధానంలో సాగు చేస్తున్న పంటకు తక్కువ నీటి లభ్యత పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా, నీరు 20 రోజులకు ఒకసారి మాత్రమే అందుబాటులో ఉన్నా పీఎండీఎస్ విధానం ద్వారా పంటను కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. తక్కువ నీటితో సాగు చేసేందుకు డ్రిప్ పద్ధతిని అనుసరించి కూరగాయలు, ఆకుకూరలు, జొన్న తదితర పంటలను సాగు చేయవచ్చన్నారు. పంట నష్టం వాస్తవంగా సంభవించినప్పుడు, ప్రభుత్వం నిబంధనల ప్రకారం సంబంధిత ప్రాంతాన్ని కరువు ప్రాంతం గా ప్రకటించిన తర్వాతే బీమా పరిహారం అందే అవకాశం ఉంటుందని తెలిపారు.పాఠశాల భవనం పూర్తి చేయటానికి డీఈవోతో నివేదిక తెప్పించుకుంటానని తెలియజేశారు.ఈ పర్యటనలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్ ప్రకృతి వ్యవసాయ అధికారి శ్రీదేవి , జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రాజశేఖర్ , ఏడి భవాని శంకర్ ,వెల్దుర్తి తాహసిల్దార్ వర్మ , ఏవో అత్తర్ భాష, అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రీకాంత్ , నాయకులు సుబ్బరాయుడు , రైతులు శ్రీను వాసులు, గురుస్వామి, కోదండపాణి,నరేంద్ర బాబు,జయరాం మొదలగువారు పాల్గొన్నారు.

