కర్నూలు, న్యూస్ వెలుగు: విఠల్ నగర్ లోని గుడ్ షెఫర్డ్ ఆంగ్ల ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషాదినోత్సవం వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మిన్నల్ల,ప్రిన్సిపల్ మెహరున్నిసా ముఖ్య అతిథిగా

గజల్ గాయకుడు, నంది అవార్డు గ్రహీత ఎస్.మహమ్మద్ మియా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మిన్నల్ల మాట్లాడుతూ తెలుగు భాషను గ్రాందికము నుండి వ్యవహారిక భాషగా కృషి చేసినటువంటి గిడుగు వెంకట రామమూర్తి పంతులు, తెలుగు బాషకు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం గజల్ గాయకుడు మహమ్మద్ మియా తన పాటల ద్వార తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరిస్తూ పాడిన పాటలు పిల్లలందరినీ మైమరపింప చేశాయి. అనంతరం చిన్నారుల కవుల వేషధారణ సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. గజల్ గాయకుడు మహమ్మద్ మియా గారిని పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కె.రంగస్వామిని కరస్పాండెంట్ మిన్నల్ల గారు శాలువా, పూలమాలతో తో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు వాణి, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Thanks for your feedback!