
హంద్రీ నదికి తక్షణమే హంద్రీ నీవా అథారిత గ్రామాలకు నీటిని విడుదల చేయాలి
కర్నూల్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన పాణ్యం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి గౌరు చరితా రెడ్డి గారి సూచన మేరకు ఆదేశాలు
కల్లూరు, న్యూస్ వెలుగు : హంద్రీ నది లో ఏర్పడుతున్న నీటి ఎద్దడి కి హంద్రీ నీవా ఆధారిత గ్రామాలు పడుతున్న తాగునీటి సమస్య లను హంద్రీ నీవా నీటిని విడుదల చేయాలని సోమవారం PGRS (17-08-2026) కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి గౌరు చరితా రెడ్డి సూచన మేరకు కర్నూల్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తెలుగుదేశం పార్టీ కల్లూరు మండల అధ్యక్షులు శ్రీ డి.రామాంజనేయులు ( AP UFIDC ) గారు, బస్తిపాడు రాజు , బస్తిపాడు రామకృష్ణ రెడ్డి , చిన్నటేకూరు రామాంజనేయులు, టీ. శేషగిరి, రేమడూరు r.మద్దిలేటి, పుల్లయ్య , పుసులూరు సుధాకర్ రెడ్డి , షరీఫ్ భాషా , బొల్లవరం గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు బీవీజీ. మస్తాన్ నాయుడు, బీవీజీ వెంకటేశ్వర్లు, s. జయన్నగౌడ్ , బీవీజీ సతీష్ కుమార్ నాయుడు, రేమడూరు, పూసులూరు, బొల్లవరం, బస్తీపాడు, చిన్నటేకూరు, k మార్కాపురం మరియు హంద్రీ ఆథారిత తదితర గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఇరిగేషన్ s.c గారిని పిలిపించి ఈ సమస్యని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ గారు. ఒక రోజులో బొల్లవరం గ్రామ హంద్రీ కి నీరు వచ్చేలా అదే విదంగా తదుపరి గ్రామాలకు కూడా నీటి ఎద్దడి తీవ్రతను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడమైనది.

