దస్తగిరిమ్మ మరణానికి కారణమైన విగ్నేసు ను కఠినంగా శిక్షించాలి

దస్తగిరిమ్మ మరణానికి కారణమైన విగ్నేసు ను కఠినంగా శిక్షించాలి

మాల మహానాడు రాయలసీమ జిల్లాల కార్యదర్శి పొన్నతోట జయచంద్ర

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; బద్వేల్ గోపవరం ప్రాంతంలో ఇంటర్ చదువుతున్న దస్తగిరి మ్మను పెట్రోల్ పోసి అంటుపెట్టి చావుకు కారణమైన విఘ్నేసును ,వారి అనుచరులను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు రాయలసీమ జిల్లాల కార్యదర్శి పొన్నతోట జయచంద్ర ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు.మహిళలకు, విద్యార్థినులకు, రక్షణ లేకుండా పోతుందని ఆరోపించారు. మొన్న మదనపల్లె , నిన్న బద్వేలు ఎప్పుడూ ఏ రోజు అమ్మాయిల పైన ,మహిళలపై న దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితిని వున్నదని విమర్శించారు. ప్రస్తుత పాలకులు మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని తెలిపారు. రాష్ట ప్రభుత్వం, రాష్ట్ర హోం మంత్రి గారు చొరవ తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, అఘాయిత్యలాకు పాల్పడిన వారిపైన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!