
తుగ్గలి తహసిల్దార్ గా రమాదేవి బాధ్యతలు స్వీకరణ
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల నూతన తహసిల్దారుగా రమాదేవి బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సత్యసాయి జిల్లా నుండి కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం తహసిల్దార్ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ రమాదేవి కు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నాగరాజు,సీనియర్ అసిస్టెంట్ రాముడు,జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్, మండల సర్వేయర్ సుధాకర్,తుగ్గలి మండలం వీఆర్వోలు, వీఆర్ఏలు,తుగ్గలి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!