బోరింగ్ కు మరమ్మతులు చేయించిన గ్రామ సర్పంచ్ యండ చౌడప్ప

బోరింగ్ కు మరమ్మతులు చేయించిన గ్రామ సర్పంచ్ యండ చౌడప్ప

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలంలోని బొంది మడుగుల గ్రామంలో ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు బొంది మడుగుల గ్రామ సర్పంచ్ యండ.చౌడప్ప ఆద్వర్యంలో సర్పంచ్ గౌరవ సలహా దారులు ఎస్.ప్రతాప్ యాదవ్ సమక్షంలో గత నెల రోజులుగా నిరుపయోగంగా ఉన్న బోరింగ్ కు మరమ్మతులు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గౌరవ సలహాదారులు ఎస్.ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామంలో త్రాగునీటి కోరకు ఉన్న చేతిపంపు (బోరింగ్) లోపల ఉన్న పైపులు సిలుము పట్టి తుప్పు పట్టిన కారణంగా నెల రోజులుగా నిరుపయోగంగా ఉన్నందున గ్రామ ప్రజల నీటి సౌకర్యం కోరకు చేతిపంపు (బోరింగ్)లోని శిలుము పట్టిన పైపులను బయటికి తీయించి వాటి స్థానంలో కొత్త పైపులను వేయించి బోరింగ్ కు మరమ్మతులు చేయించడం జరిగిందని సర్పంచ్ గౌరవ సలహా దారులు ఎస్.ప్రతాప్ యాదవ్ తెలియజేస్తూ గ్రామంలోని గ్రామ ప్రజల సౌకర్యం కొరకు పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ చొరవతో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!