
ఏళ్ళు గడుస్తున్న మారని కులవివక్ష : గొందిపల్లె మాలతి
కర్నూలు న్యూస్ వెలుగు : ఏళ్ళు గడుస్తున్న మారని కులవివక్షత నేటి కి దళితులు ఎదుర్కొంటున్నట్లు బీజేపీ నాయకురాలు గొందిపల్లె మాలతి ఆవేదన వ్యక్తం చేశారు. మాలతి భర్త భైరి రామాంజనేయులు తన కుటుంబ సమేతంగా జనవరి 15న కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం,సోమయాజులపల్లె గ్రామ దేవత సుంకులమ్మ గుడికి వెళ్ళగ అక్కడి పూజారులు తమను అడ్డుకుని, నీచ పదజాలం వాడరని, తమను బహిరంగంగా అవమానపరచడమే కాకుండా కులవివక్షత చూపారని, దీనికి భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మీడియతో మాట్లాడి అనంతరం ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు . గుడి పూజారి అయిన బలిజ జనార్దన్, కుమారుడు బలిజ వంశీ ఉద్దేశపూర్వకంగా తమను అవమాన పరిచరని దీనిపై ఓర్వకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!

