
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంత్రి టిజీ భరత్
కర్నూలు న్యూస్ వెలుగు: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి.జి.భరత్ జిజిహెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రభుత్వ సర్వజన వైద్యశాల డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి.జి.భరత్, జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నెక్స్ట్ జెన్ ఈ హాస్పిటల్ సాఫ్ట్వేర్ ను వినియోగించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని వైద్య సేవలు పేపర్ లెస్ గా అందించే విధంగ చర్యలు తీసుకోవాలని.మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పందులను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని, మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న చెత్త ను తీసి పందులను మేపుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీస్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆక్సిజన్ సరఫరా అంశం పై అధికంగా చెల్లిస్తున్నారని, తన సొంత ఆసుపత్రికి కేవలం 13 రూపాయలు చొప్పున ఆక్సిజన్ సరఫరా జరుగుతున్నదని, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రం 38 రూపాయలు చెల్లిస్తున్నారని, ఈ విషయాన్ని తాను పలు మార్లు ప్రస్తావించానని మంత్రి పేర్కొన్నారు… కావున వెంటనే ఈ ధరలను తగ్గించి ప్రభుత్వ ధనాన్ని పొదుపు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. కలెక్టర్ స్పందించి, ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ను కేటాయించవలసిందిగా మంత్రి కలెక్టర్ కు సూచించారు.. అంబులెన్స్ లు పేషెంట్ ల కుటుంబాల నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా ధరలను నిర్ణయించి, ఆ వివరాలను ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 5, 6 ప్రదేశాల్లో వాటిని ప్రదర్శించాలని మంత్రి జిజిహెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు..
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ పేషెంట్ ఓపి తీసుకున్నప్పటి నుండి ఏ రోగం ఉంది, ఏ పరీక్షలు చేశారు లాంటి వివరాలు అన్నీ కూడా కేవలం మాన్యువల్ గా కాకుండా ఆన్లైన్ లో (అభా యాప్) లో కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిజిహెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు… నెఫ్రాలజీ ఆపరేషన్ థియేటర్ జనవరి చివరి తేదీ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపిఎంఎస్ఐడిసి అధికారులను ఆదేశించారు.. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుధ్యం బాగా మెయింటైన్ చేయాలని, సంబంధిత ఏజెన్సీకి మెయింటెనెన్స్ ప్రకారంగా మార్కులు వేయాలని కలెక్టర్ జిజిహెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్క్రాప్ చాలా ఉందని క్లియర్ చేయించాలని, డ్రెయిన్లను శుభ్రం చేయించాలని, ఆక్సిజన్ లీకేజ్ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, హాస్టల్ పరిసరాల్లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయించాలని మంత్రి దృష్టికి తీసుకొని రాగా వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సమావేశంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ , ఆసుపత్రి సూపరిండెంట్ డా.వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రవీణ్ , రఘునాథ్ రెడ్డి , జగదీష్ , ప్రదీప్ , పద్మజ, ఏపీఎంఐడిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

