
నటుడు ప్రకాష్ రాజు పై వ్యతిరేకంగా వినూత్నంగా చిత్రం
నంద్యాల, న్యూస్ వెలుగు : ఇటీవల శ్రీరామునిపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ గురువారం తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి ఆయన ఒక చిత్రాన్ని వినూత్నంగా గీసినట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మగ పిల్లలు ప్రకాష్ రాజ్ ముఖం మీద మూత్రం పోస్తూన్నట్లు, ప్రజలు ముఖం మీద ఉమ్మిచినట్లు, కాళ్ళతో పాతాళ లోకానికి తొక్కి నట్లు, మెడలో చెప్పుల దండ వేసినట్లు, ఇంకోసారి ఇలా మాట్లాడితే చెప్పుతో కొడతామని చెప్పు చూపించినట్లు చిత్రం గీసినట్లు కోటేష్ తెలిపారు. గతంలో చాలా సార్లు హిందూ మతం పై, హిందువుల దేవుళ్ళ ను చులకనగా చేస్తూ మాట్లాడినాడు. కోట్లాది మంది హిందువులు రామాయణాన్ని, శ్రీరామున్ని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. అటువంటి శ్రీరాముని నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజల ఆగ్రహనికి గురై చెప్పుల వర్షం కురిపిస్తారు. గతంలో చాలా మంది హిందూ దేవుళ్ళ పై నీచంగా మాట్లాడి దిక్కు లేని చావు చచ్చారు. మన దేశం లో అన్ని మతాలు వున్నాయి. ఎవరి మతం వాళ్ళకు గొప్ప. అన్ని మతాల వారు కలిసి మెలసి వుంటున్నారు. కాని కొంతమంది ప్రకాష్ రాజ్ వంటి వారు ఉన్మాదంగా మారి హిందు మతం గురించి, హిందు దేవుళ్ళ ను గురించి చులకనగా మాట్లాడుతున్నారు. ఇటువంటి వారిని శిక్షించాలన్నారు.

