రైతులకు ఎరువుల పంపిణీ…ఏవో వెంకట రాముడు

రైతులకు ఎరువుల పంపిణీ…ఏవో వెంకట రాముడు

 న్యూస్ వెలుగు  పత్తికొండ: రైతులు గత సంవత్సరం పండించిన పంటల ఆధారంగా ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా డిఎపి ఇవ్వబడుతుంది. మంగళవారం రోజున పత్తికొండ మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ ఎంటర్ప్రైజెస్, మన గ్రోమోర్ సెంటర్, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ ద్వారా రైతులకు యూరియా, డి ఏ పి అందజేయడం జరిగింది కావలసిన రైతులు తమ గ్రామంలోని రైతు సేవ కేంద్రాల ఇన్చార్జిల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం వెరిఫై చేయించుకోవాలి. అనంతరం రైతు సేవా కేంద్రంలో గాను గ్రామంలో లేదా మండలంలో కలిగి ఉన్న ఎరువు రిటైలర్ దుకాణాలలో యూరియా డిఏపి పొందవచ్చును. రైతులు గత కాలంలో పండించిన పంటల ఆధారంగా వివిధ దఫాలలో ఎరువులు అందించడం జరుగుతుంది రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని పాటించాలి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనాథ్ రైతులు రిటైలర్ యజమానులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS