పేద ముస్లిం కుటుంబాలకు తోఫాల పంపిణీ
డోన్ న్యూస్ వెలుగు :
పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు పండుగకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం బుధవారం డోన్ పట్టణంలోని శ్రీరామనగర్, వైఎస్సార్ నగర్ కాలనీల్లో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు షేమిమ్ బేగం మాట్లాడుతూ, ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తూ జరుపుకునే రంజాన్ పండుగ పవిత్రతను వివరించారు.
ఆమె మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న అన్యాయాలు, దాడులు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఐద్వా నిరంతరం పోరాటం చేస్తున్నదని చెప్పారు. సమాజంలో మద్యం, మట్కా, గంజాయి వంటి మాదకద్రవ్యాల వ్యసనాల వల్ల మహిళల జీవితాలు చీకటిలోకి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అశ్లీలతకు వ్యతిరేకంగా కూడా సంఘం పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు.
రంజాన్ పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందంగా జరగాలని ఆకాంక్షిస్తూ, పేద ముస్లిం కుటుంబాలకు సహాయం అందించడం ద్వారా వారి ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొల్పడం ఐద్వా లక్ష్యమని పేర్కొన్నారు. రంజాన్ కేవలం ఆచారం మాత్రమే కాకుండా సేవా భావానికి ప్రతీక అని, పేదలతో పండుగ ఆనందాన్ని పంచుకోవడం సంఘం ముఖ్య లక్ష్యమని తెలిపారు.
సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం పెంపొందించడంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు మాధవి, బీబీ, సూర్య పద్మావతి, సిరిన, ఇర్ఫాన, సులోచనలతో పాటు పలువురు ముస్లిం మహిళలు పాల్గొన్నారు.రంజాన్ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం(ఐద్వా) సేవా కార్యక్రమం – పేద ముస్లిం కుటుంబాలకు తోఫాల పంపిణీ.డోన్

ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు మాధవి, బీబీ, సూర్య పద్మావతి, సిరిన, ఇర్ఫాన, సులోచనలతో పాటు పలువురు ముస్లిం మహిళలు పాల్గొన్నారు.