మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణలో పాల్గొన్న నంది విజయలక్ష్మి

మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణలో పాల్గొన్న నంది విజయలక్ష్మి

నంద్యాల న్యూస్ వెలుగు : ఆధునిక సామాజిక సంఘ సంస్కర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ సావిత్రిబాయి పూలే జయంతి రోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని చదువుల తల్లులు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ గార్ల జయంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యకురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. మహిళా ఐక్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షురాలు కటికే భాను ఆధ్వర్యంలో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ అధ్యక్షతన నంద్యాల జిల్లా బేతంచర్ల మండలంలో మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందు మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే ల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పులే ల విగ్రహా దాత నక్కలమిట్ట శ్రీనివాసులు, ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి,ఎం.ఈ.వో లు సోమశేఖర్, అబ్రహం, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియదాసు, వైస్ ప్రిన్సిపాల్ నాగరాజు, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నాయకులు సురేంద్ర , మైనార్టీ నాయకులు అన్వర్ హుస్సేన్ పాల్గొని మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించడం జరిగినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే ల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు. చదువుల తల్లి సావిత్రిబాయిపూలే జయంతి జనవరి 3 వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!