నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి కి కృతజ్ఞతలు తెలిపిన పిజి విద్యార్థులు

నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి కి కృతజ్ఞతలు తెలిపిన పిజి విద్యార్థులు

పునర్వికకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్ బైరెడ్డి శబరి

పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 50 లక్షలు ఆర్థిక సహాయం అందజేత

రాయలసీమ ఉద్యమ యువ నాయకులు సీమ కృష్ణ రాథోడ్

కర్నూలు, న్యూస్ వెలుగు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థుల ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంటు సభ్యురాలు,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కి బుధవారం కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులు మరియు రాయలసీమ ఉద్యమ

యువ నాయకులు సీమ కృష్ణ రాథోడ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన రెండు సంవత్సరాల గల పునర్వికకు అనారోగ్యంతో బాధపడుతుండటంతో వారి తల్లిదండ్రులు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరిని ఆశ్రయించడంతో మానవతా దృక్పథంతో పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలను పునర్విక వైద్య ఖర్చుల నిమిత్తం అందజేయడం జరిగిందన్నారు. మానవతా దృక్పథం చూపించిన నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరికి యూనివర్సిటీ పిజి విద్యార్థుల ఆధ్వర్యంలో థ్యాంక్యూ బైరెడ్డి శబరి అక్క కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు సేవా గణేష్ నాయక్
సన్ని, ప్రేమ కుమార్, మహేంద్ర మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS