
రాజ్యాధికారంతోనే సమాజంలో సమూచిత గౌరవం : రామకొండ వెంకటేశ్వర్లు
పత్తికొండ, న్యూస్ వెలుగు : ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఘనంగా నిర్వహించినట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ రామకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… సమాజంలో అస్పృశ్యత అంటరానితనం వివక్షత ను రూపుమాపాలంటే విద్య ఎంతో అవసరమని ఆయన అన్నారు. 75 సంవత్సరాల సుదీర్ఘ భారత దేశంలో అంటరానితనం అస్పృశ్యత నేటికీ దళితులు అనుభవించాల్సి వస్తోందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలను అనుసరించాలని ప్రజలకు, యువతకు ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమనికి బురుజుల పులికొండ ప్రత్యేక ఆహ్వానీతులుగా పాల్గొని మాట్లాడరు .. దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమం లో దళిత సంఘ నాయకులు గోపాలం ఉచ్చూరప్ప, ముత్యాల ప్రసాద్ నర్శ్యామల నరసింహుడు ముత్యాల నాగన్న, పందికొన నారాయణస్వామి,బుడగ జంగాల లింగన్న బొంతల నరసిహులు,నారాయణ,తిక్కయ్య,కరెన్న, రామాంజనేయులు కోసిగి విజయ్.తదితరులు పాల్గొన్నారు.

