పేదల కడుపు కొట్టెందుకే కొత్త చట్టాలు : కాంగ్రెస్
నంద్యాల న్యూస్ వెలుగు: పేదోడి కడుపు మీద మోడీ ప్రభుత్వం దెబ్బ కొట్టి కరువు పని లేకుండా అనగా ఉపాధి హామీ పథకం లేకుండా చేయడానికి కుట్ర కుట్ర జరుగుతుందని నంద్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి అన్నారు. ఈ రోజు నంద్యాల పార్లమెంట్ డోన్ నియోజకవర్గం లో పార్టీ కార్యాలయములో పత్రిక సమావేశములో మాట్లాడుతూ.
ఇటీవల వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (వి బి -జి రాం జి) యాక్ట్ అనే నూతన పథకం పేదలకు పని హక్కును కాల రాసే విదంగా ఉందని, ఇన్నాళ్లు పేదోడి కడుపు నింపిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్( ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జి ఎస్)ను కనుమరుగు చేసే పన్నాగాలు కేంద్రములో బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నాగాం చేస్తుందని వారు మండి పడ్డారు.
నూతనపథకం ప్రకారం
ఉపాధిహామీకరువుపనులుచూపించండి అని పేదలు అడిగే హక్కు కోల్పోతామని,
ఎప్పుడు, ఎక్కడ పనులు చేయాలో ఢిల్లీ లో ఉన్న పెద్దలు చెప్పిన కాంట్రాక్టర్ ల చేతిలో ఉంటుంది,మన చేతుల్లో ఉండదని,ఇన్నాళ్లు కరువు పనికి ప్రతి 100లో 90 రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం, ఇక మీదట 60 రూపాయలే ఇస్తాము, మిగతాది మీ రాష్ట్రల వాళ్ళే భరించాలని ముఖం మీద చెప్పడం దీని ద్వారా మన మీదే ఆ భారం ఉంటుంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు, అస్సలు బడ్జెట్ లేని రాష్ట్రాల్లో ఇక కరువు పనులు జరిగే అవకాశం ఉండదు.కరువు పనుల్లో ఏమి పనులు చేయాలో మనం స్థానిక గ్రామ సభలు మరియు పంచాయతీలలో తీర్మానం చేసేవాళ్ళం. ఇప్పుడు సెంట్రల్ ప్లానింగ్ మరియు కాంట్రాక్టర్లకు అధికారం ఇస్తారని
వ్యవసాయ సీజన్లలో 60-రోజుల బ్లాక్ఔట్ పీరియడ్ తెచ్చారు అంటే పని సీజన్ లో 2 నెలలు కరువు పనులు ఉండవు అని అంటున్నారు.అంటే వ్యవసాయ కూలీల ముఠాలు వాళ్ళ కూలీల రేట్లు పెంచవద్దని అడగవద్దని చెప్పకనే చెబుతున్నారు.అంతే కాకుండా ఈ పథకములో పని చేసే ఉద్యోగుల పరిస్థితి అగమ్య గొచరం అని, వీరికి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదని, ఇంతవరకు దాదాపుగా 6నెలల జీతాలు చెల్లించలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని వారు అన్నారు.
కొత్త స్కీం లు తెండి కానీ అది ఆదుకొనే విధంగా ఉండాలి కానీ అవమానించే విధంగా, హక్కులను కాలరాసే విధంగా ఉండకూడదు.కూలీల నోటి కాడ కూడు తీసే నల్ల చట్టం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
భారతదేశంలోని అన్ని రంగాలలో గల మేధావులు పేదవాడి నోటికాడ అన్నం ముద్దను లాగే ఈ ప్రయత్నాన్ని ఖండించాలని, వి బి -జి రాం జి పథకాన్ని వెనుకకు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు యు. జనార్దన్, డిసిసి ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, డిసిసి కార్యదర్శి ఆర్.గోపినాథ రావ్,మధు సూదన్ రెడ్డి,డోన్ మండల అధ్యక్షులు పఠాన్ హుస్సేన్, నాయకులు నాగన్న, గిడ్డయ్య, మహిళా నాయకురాలు లక్ష్మి దేవి,నాగమద్ది తదితరులు పాల్గొన్నారు.

