FlatNews Buy Now
బండి ఆత్మకూరు మండలంలో 20 మంది విద్యార్థులు గైర్హాజరు

బండి ఆత్మకూరు మండలంలో 20 మంది విద్యార్థులు గైర్హాజరు

 

నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు ) మార్చి 16 : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలంలో సోమవారం జరిగిన పదవ తరగతి తెలుగు పరీక్షకు 20 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఎంఈఓ యశోద తెలిపారు. వారు మాట్లాడుతూ.. బండి ఆత్మకూరు జడ్పీ హైస్కూల్ నందు 215 మంది విద్యార్థులకు గాను 205 మంది విద్యార్థులు, ఏపీ మోడల్ స్కూల్ నందు 220 మంది విద్యార్థులకు గాను 213 మంది విద్యార్థులు, సంత జూటూరు జడ్పీ హైస్కూల్ నందు 99 మంది విద్యార్థులకు గాను 96 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. మొత్తం 534 మంది విద్యార్థులకు గాను 514 మంది విద్యార్థులు హాజరైనట్లు, 20 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. స్కాడు ఎవరు రాలేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బండి ఆత్మకూరు ఎస్సై జగన్మోహన్ మూడు పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ను ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS