*నేడు లింగాపురంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం, ఫెర్టిలిటీ క్యాంప్ కార్యక్రమం*
నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు ) మార్చి 24 : పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని పశువైద్య అధికారులు డాక్టర్. అనూష, డాక్టర్. జోష్ణ తెలిపారు. వారు మాట్లాడుతూ.. మంగళవారం బండి ఆత్మకూరు మండలంలోని బి. కోడూరు, కడమల కాల్వ గ్రామాలలో 550 పశువులకు, లింగాపురం, చిన్నదేవలాపురం గ్రామాలలో 750 పశువులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. అలాగే నేడు లింగాపురం గ్రామంలో మార్కెట్ యార్డ్ వారి సౌజన్యంతో ఉచిత పశు ఆరోగ్య శిబిరం, ఫెర్టిలిటీ క్యాంప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!

