హోటల్ వర్కర్స్ సంక్షేమ బోర్డు అమలు చేయాలి : ఎస్ మునెప్ప

హోటల్ వర్కర్స్ సంక్షేమ బోర్డు అమలు చేయాలి : ఎస్ మునెప్ప

కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు హెూటల్ వర్కర్స్ కు ప్రభుత్వం సంక్షేమ బోర్డును అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునెప్ప డిమాండ్ చేశారు. బుధవారం అంబేదర్కర్ భవన్లో కర్నూలు నగర హెూటల్ వర్కర్స్ అండ్ బేకరీ వర్కర్స్ యూనియన్ మూడవ నగర మహాసభ నాయకులు పురుషోత్తం అధ్యక్షతన నిర్వహించారు. అంతకు ముందు ఆర్ఎస్ రోడ్డు నుండి అంబేద్కర్ భవన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మహాసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోటల్ వర్కర్స్ అండ్ బేకరీ వర్కర్స్ యూనియన్ పతాకాన్ని సీనియర్ వర్కర్ నారాయణ అవిష్కరించారు. మహాసభలలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి ఎక్కువగా కల్పించే రంగాల్లో బిల్డింగ్ వర్కర్స్, హెూటల్ వర్కర్స్ రంగమే అని దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో 12 కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్లు ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తుందన్నారు. ఇటీవల ఈ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందడంతో ఉపాధి కూడా పెరిగిందన్నారు. ఈరంగంలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుండి పెద్దఎత్తున ఈ రంగంలోకి పనిచేయడానికి వస్తున్నారన్నారు. గతంలో కార్మికులు యాజమాన్యం వివక్షతకు గురయ్యోవారన్నారు. కానీ నేడు యూనియన్ ఏర్పడిన తరువాత యాజమాన్యం కార్మికుల మద్యం మంచి సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. హెూటల్ వర్కర్స్క పిఎఫ్, ఈఎస్ఐతో కూడుకున్న సంక్షేమ చట్టం అమలు చేయాలి.. ప్రతి రోజు 8గంటల పని విధానం అమలు చేయాలి.పనిచేసే వద్ద పని భద్రత కల్పించాలి. హెూటల్లో కార్మికునికి ప్రమాదం జరిగితే యాజమాన్యం బాధ్యత వహిస్తూ కార్మికుని కుటుంబానికి ఉపాధి కల్పించాలి. ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే హెూటల్ యజమాన్యమే ఆకుటుంబాన్ని ఆదుకోవాలి ఆయన డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ నగర కార్యదర్శినీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ హెటల్ వర్కర్స్ కు ప్రభుత్వం సంక్షేమ బోర్డును అమలు చేయాలనేది న్యాయమైన డిమాండ్ అన్నారు. కర్నూలులో పెద్దఎత్తున హోటల్ రంగం విస్తరిస్తున్నాయని కనుక యూనియన్ ను మరింత విస్తృతంగా విస్తరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ యూనియన్ను జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేయాలన్నారు. ఏఐటీయూసీ-జిల్లా డిప్యూటీ కార్యదర్శి క్రిష్ణయ్య మాట్లాడుతూ యూనియన్ బలోపేతం చేసుకోవాలన్నారు. కార్మికులు ఐక్యంగా ఉంటేనే యూనియన్ బలంగా ఉంటుందన్నారు. హెూటల్ వర్కర్స్ యూనియన్ను జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు నాయకులు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మనోహర్మాణిక్యం, కె జగన్నాధం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షకార్యదర్శులు వెంకటేష్, చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ క్రిష్ణారెడ్డి, డిప్యూటీ కార్యదర్శి రామాంజనేయులు, ఆటోవరల్డర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈశ్వర్, గణేష్, రాము, భవననిర్మాణ కార్మికసంఘం నాయకులు నల్లన్న, రేణుక, రేణుక, ఆశావర ఆశావర్కర్స్ యూనియన్ నాయకులు రమిజాలీ హెూటల్ వర్కర్స్’ యూనియన్ నాయకులు నాగేంద్ర, ఆనందు. అబ్దుల్లా, నరసింహులు, ముర్తుజావళి, శ్రీకాంత్, రంగనాయకులు, నాగరాజు, మల్లి బాష అయ్యన్న రామచంద్రుడు. తదితరులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!