11 ద్విచక్ర వాహనాలు చోరీ: సీఐ శేషయ్య

11 ద్విచక్ర వాహనాలు చోరీ: సీఐ శేషయ్య

కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు కేంద్రంలో ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు కర్నూలు 3 టౌన్ సీఐ శేషయ్య మంగళవారం మీడియాకు తెలిపారు. నిందితుడు కర్నూలు జిల్లా కోడుమూరు మండలానికి చెందిన ప్యాలకుర్తి గ్రామానికి చెందిన లద్దగిరి అలీమ్ భాషాగా గుర్తించినట్లు సిఐ పి శేషయ్య వెల్లడించారు. డిసెంబర్ 3 2025న రాజు అనే బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా సిసి ఫూటేజి, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దొంగను గుర్తించినట్లు త్రీ టౌన్ సిఐ పి శేషయ్య తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకోని మొత్తం 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోగా.. అందులో హోండా సైన్ 1, ఒకటి, యూనికాన్ సంబంధించిన తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోగా మరో పల్సర్ బైకు కూడ ఉన్నట్లు వెల్లడించారు.ఈ కేసును చాకచక్యంగా చేదించినటువంటి ఎస్సై లు శ్రీనివాసులు,వీటి ఆశాలత, ఏ.సీ పీరయ్య, బాల నరసింహులు, సిబ్బంది చెంచన్న సుంకన్న, సంతోష్ కుమార్, చంద్రబాబు నాయుడు, ముజఫర్ రహమాన్, పాండు నాయకుల ను డిఎస్పి అభినందించినట్లు వెల్లడించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS