గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: ఎస్వీ మోహన్ రెడ్డి

గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: ఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు న్యూస్ వెలుగు : ఎమ్మిగనూరు లో 2019 లో గుండ్రేవుల ప్రాజెక్ట్ కి ఫౌండేషన్ వేశారు.. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు?  జగన్ మెహన్ రెడ్డి  వచ్చాక గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు అని హామీ ఇచ్చారు.. అంటే చేస్తారు.  ఇలాంటి ప్రాజెక్ట్ ల గురించి ప్రజలు ప్రశ్నిస్తారని మతం మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మీరు అధికారం లో ఉన్నప్పుడు ఎన్ని గుడులు పడగొట్టారు? వాటిని మళ్ళీ మీరు పునర్మించారా? జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాక దేశమంతా వెంకటేశ్వర స్వామి గుడ్లు కట్టించారు.
మరి మీరు హిందువుల కోసం ఎన్ని గుడులు కట్టించారు అని విమర్శించారు.  రాజకీయాల కోసం ఇంత దిగజారి దేవుళ్ళ మీద రాజకీయం చేస్తున్నారు. మీరు పీఠధిపతులతో మాట్లాడించండి, మీటింగ్ లు పెట్టి గుడులు కడగండి, హిందూ వ్యతిరేక పార్టీ అని బురద జల్లండి అని మీ పేపర్ లోనే వచ్చింది.  ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే మీకు పుట్టగతులు ఉండవని ముఖ్యంగా లోకేష్ గారికి హెచ్చరించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS