
ఉల్లిగడ్డ రైతుల సమస్యలను తెలుసు కుంటున్న కోట్ల సూర్య
డోన్, న్యూస్ వెలుగు ; డోన్ మండలంలోని కొచ్చెరువు గ్రామంలో ఉల్లిగడ్డ రైతుల సమస్యలను తెలుసుకునేందుకు డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి బుధవారం ప్రత్యేకంగా సందర్శించారు. పంట దశ, ఉత్పత్తి ఖర్చులు, ప్రస్తుత మార్కెట్ ధరలు, నిల్వ సదుపాయాల లోపం వంటి పలు అంశాలపై రైతులతో ముఖాముఖీగా చర్చించారు.రైతులు
ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమగ్రంగా విన్న ఎమ్మెల్యే , ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు సరైన మద్దతు ధర, మార్కెట్ నిలకడ, రవాణా సౌకర్యాలు, సబ్సిడీల లభ్యత వంటి విషయాల్లో వారు చెప్పిన సూచనలను కూడా పరిగణ
లోకి తీసుకుంటామని ఎమ్మెల్యే కోట్ల తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

