
సంతకాల సేకరణ చేపట్టిన సీఐటీయూ
కర్నూలు న్యూస్ వెలుగు : భవన నిర్మాణ కార్మికులకు గతంలో ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేంతవరకు పోరాటాలు చేస్తామని సిఐటియు నాయకులు తెలిపారు ఈరోజు 32వ వార్డు ముజఫర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షులు కే సుధాకరప్ప మాట్లాడుతూ అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాటి ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఈ పథకాల అమలు కోసం సంక్షేమ బోర్డు కు వివిధ నిర్మాణాల ద్వారా ఒక శాతం సెస్సు నిధులను సమకూర్చి వాటి ద్వారా సంక్షేమ పథకాలను 2009 నుంచి అమలు చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా కార్మికులు ప్రమాదానికి గురి అయినప్పుడు వాటి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం సంక్షేమ బోర్డు నిధుల ద్వారా నిర్మాణ కార్మికుడికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు ప్రసూతి సౌకర్యం రెండు కాన్పుల వరకు ఇవ్వడం జరిగిందని అలాగే పెళ్లి కానుక యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారిని ఆదుకున్నారని అలాగే స్కాలర్షిప్లు కార్మికునికి అవసరమైన పనిముట్లు ఇవ్వడం జరిగిందని కార్మికుడు సహజ మరణం పొందితే 80 వేలు అందజేయడం జరిగిందని కానీ నేటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా బోర్డును నిర్వీర్యం చేసి భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం చేసిందని వారు తెలిపారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చంద్రబాబునాయుడు కేవలం నాలుగు పథకాలను ప్రకటించి చేతులు దులుపుకున్నారని వారు తెలిపారు నాలుగైదు అంతస్తుల భవనం పై నుండి క్రిందపడి మరణించిన కార్మికునికి కుటుంబానికి 5 లక్షలు ఇవ్వడాన్ని మరిచారని వారు తెలిపారు కార్మికుడు క్రిందపడి కాలు చేతులు విరిగి అంగవైకల్యం కలిగిన కార్మికులను కూడా విస్మరించారని అలాగే సహజ మరణం పొందితే రెండు లక్షలు ఇవ్వడానికి బదులుగా 80 వేలు ఇవ్వడం సరైనది కాదని వారు తెలిపారు సంక్షేమ బోర్డులు నిధులు ఉన్న వాటిని ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు మళ్లించడం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో భవన నిర్మాణ కార్మికులకు అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రమాదంలో మరణించిన కార్మికుడికి ఐదు లక్షలు అంగవైకల్యం పొందిన కార్మికునికి రెండు లక్షలు సమాజ మరణం పొందిన కార్మికులకు 2 లక్షలు 50 సంవత్సరాలు నిండిన కార్మికుడికి నెలకు 10 వేలు పెన్షన్ నిర్మాణ కార్మికుడికి ఇల్లు ఇళ్లస్థలాలు పనిముట్లు కొనడానికి రుణాలు అమలు చేసేందుకు ప్రకటన చేయాలని వారు తెలిపారు లేదంటే ఏప్రిల్ నెల 6 వ తేదీన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఆనందు వెంకటరమణ జలాలుద్దీన్ ఆర్ శ్రీనివాసులు ఎం ఏసన్న ఆంజనేయులు షాకీర్ నజీర్ మహబూబ్ బాషా నబి సాహెబ్ వలి వెంకటేశ్వరమ్మ తదితరులు హాజరయ్యారు.

