
పారిశుద్ధ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి:సీఐటీయూ
కర్నూలు న్యూస్ వెలుగు : సిఐటియు ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు మైమూద్ అధ్యక్షతన మెడికల్ అండ్ హెల్త్ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు పైబడిన కార్మికుల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, అక్రమంగా తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని MOUలో ఉన్న ప్రకారం కార్మికులకు బెనిఫిట్స్ అమలు చేయాలని కోరుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పద్మావతి హాస్పిటలిటీ & హాస్పిటలిటీ ఏజెన్సీ ఆఫీసును ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ పాల్గొని మాట్లాడుతూ కర్నూలు మెడికల్ అండ్ హెల్త్ పరిధిలో ఉన్న హాస్పటల్స్, మెడికల్ కాలేజీ, హాస్టల్ లలో పరిశుభ్రం చేయించడానికి టెండర్ దక్కించుకున్న పద్మావతి ఫెర్టిలిటీ ఏజెన్సీ వారు కార్మికులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారని 50 సంవత్సరాల వారిని తొలగించడానికి మీరు సహకరిస్తేనే మీకు జీతాలు ఇస్తామని లేదంటే మీకు జీతాలు ఇవ్వమని అతి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని బాధ వ్యక్తం చేశారు, ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ వారితో రాయలసీమ జోన్ కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, తిరుపతి హాస్పటల్స్ లో పారిశుద్ధ్యo చేస్తున్న కార్మికు అగ్రిమెంటు లో 50 సంవత్సరాలు పైబడిన కొత్త కార్మికులను నియమించ రాదని ఉంటే గత 25 సంవత్సరాల నుండి నమ్మకంగా కష్టపడి పని చేస్తున్న కార్మికులను తొలగించడం సరైన పద్ధతి కాదన్నారు, నంద్యాల, అనంతపురం,కడప,తిరుపతి హాస్పిటల్ మెడికల్ కాలేజీ లలో పనిచేస్తున్న కార్మికులను తొలగించడం దారుణం అన్నారు,అన్ని ప్రభుత్వ సంస్థలలో 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ GOలు ఉండగా హాస్పిటల్ లో పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం 50 సంవత్సరాలు పైబడిన వారు ఉండకూడదని ఎటువంటి GO లు లేకపోయినా DME తో చేసుకున్న అగ్రిమెంట్ లో చట్ట విరుద్ధంగా ఉందంటున్నారు, రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ లో పారిశుద్ధ్య కార్మికులకు ఏ జోన్ లో లేని సమస్య ముఖ్యమంత్రి గారి బంధువైన భాస్కర నాయుడు అగ్రిమెంట్ చేసుకున్న రాయలసీమ జోన్ లో మాత్రమే ఈసమస్య ఉండడం అనేక ప్రశ్నలకు దారితీస్తుందన్నారు,70సంవత్సరాలు దాటిన నరేంద్ర మోడీ,చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని,రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉంటే కనీసం మేము హాస్పటల్ ను పరిశుభ్రంగా ఉంచలేమా అని కార్మికులు బాధ వ్యక్తం చేస్తున్నారని అన్నారు, గత వైసిపి ప్రభుత్వం కార్మికులను పర్మినెంట్ చేస్తామని లేదా అప్కాసులో చేరుస్తామని చెప్పి చేర్చకుండా మోసం చేశారన్నారు, దేశంలో రాష్ట్రంలో మన డబల్ ఇంజన్ సర్కారు అధికారంలోనికి వస్తే కార్మికులందరికీ న్యాయం చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు డిఎంఈ అగ్రిమెంట్ లోనే కార్మికులను మోసం చేశారని విమర్శించారు,తన బంధువైన భాస్కర నాయుడుకు అగ్రిమెంటు ఇప్పించి,ఓట్లేసి గెలిపించిన కార్మికులను తొలగిస్తు వారి కుటుంబాలను రోడ్డున వేస్తున్నారని బాధ వ్యక్తం చేశారు,చట్టవిరుద్ధంగా ఉన్న అగ్రిమెంటును సరిచేయాలని అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోనికి తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఆర్డర్ ను అమలు చేయవలసిన ప్రభుత్వ అధికారులు, హైకోర్టు ఆర్డర్ ను తుంగలో తొక్కె విధంగా అధికారులనే ముఖ్యమంత్రి పేరు చెప్పి భయపెడుతున్నారని గుర్తు చేశారు, ఏజెన్సీ మేనేజర్లు నిరసన కార్యక్రమాలు దగ్గరకు వచ్చి మీ డిమాండ్లు పెండింగ్ జీతాలు, 50 సంవత్సరాలు పైబడిన కార్మికుల హైకోర్టు స్టే,ఈ ఎస్ ఐ పి ఎఫ్, డ్యూటీలో వస్తారు మహిళా కార్మికులపై వేధింపులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, హామీలు అమలు గాని పక్షాన కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు రామకృష్ణ,నాగరాజు ,కుమార్,శేఖర్, సోలమన్ రాజు,సిఐటియు నాయకులు నగేష్, గిడ్డయ్య, శ్రీను, మాసుమ్,అయ్యన్న, ప్రసాద్,షఫీ,షేక్ష, శేఖర్,రాము, సంసోను,అయ్యస్వామి, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.

