పశువైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏడీ

పశువైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏడీ

నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు మండలంలోని ఏ.కోడూరు, పార్నపల్లె, బండి ఆత్మకూరు పశు వైద్యశాలలను వెలుగోడు సబ్ డివిజన్

పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. పశు వైద్యశాలలో రిజిస్టర్లను, మందులను పరిశీలించారు. గాలికుంటు వ్యాధి టీకాల ప్రగతిని సమీక్షించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. వారితో పాటు మండల పశు వైద్య అధికారులు డాక్టర్ అనూష, డాక్టర్ జోష్ణ దేవి పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS