FlatNews Buy Now
 డ్రైనేజీ  సమస్య  పరిష్కరించని అధికారులు 

 డ్రైనేజీ  సమస్య  పరిష్కరించని అధికారులు 

మురుగునీరు నిల్వ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

నంద్యాల, న్యూస్ వెలుగు : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ

ఉండడంతో మురుగునీరు నిల్వ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అలాగే మినీ మంచినీటి ట్యాంక్ దగ్గర అపరిశుభ్రంగా, పైపులకు ఆన్ ఆఫ్ ట్యాబులు లేకపోవడంతో నీరు నిరంతరం ప్రవహిస్తూ నీరు వృధా అవుతుంది.గ్రామపం చాయతీ అధికారులకు తెలియజేసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సమస్యను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS